కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రికత్తత నెలకొంది. పట్టంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు పురపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. స్థానిక డీఎస్పీ ప్రసాదరావు నేతృత్వంలో పోలీసులు ధర్నాను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, బీజేపీ నేతలు, కార్యర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ధర్నాను విరమించుకొని టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన ప్రదేశానికి వెళ్లాలని ప్రయత్నించిన బీజేపీ నేలతను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో చాలా సేపు తోపులాట జరిగింది. ఆందోళన విరమించాలని డీఎస్పీ కోరారు. వారు ఓప్పుకోకపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు నేతలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
https://www.facebook.com/somuveerrajubjp/videos/545299266662082
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Tension in proddatur
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com