
జిల్లాలోని వీణవంక మండలం వల్బాపూర్ లో మాజీమంత్రి, ఈటల రాజేందర్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రికత్త చోటు చేసుకుంది. రాజేందర్ సమక్షంలో పలువురు కార్యకర్తలు భాజపాలో చేరారు. భాజపాలో చేరుతున్న వారిని స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ ఫొటోలు తీశారు. దీంతో ఏఎస్ఐతో భాజపా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. భాజపా కార్యకర్తల తోపులాటలో ఏఎస్ పై చొక్కా చిరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా భాజపా శ్రేణులు నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.