
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే కర్ఫూ నేటితో ముగుస్తున్నందున తదుపరి తీసుకోబోతున్న చర్యలపై నిన్న విచారణ జరిగిన సంగతి తెలిసిందే. అయినే నేడు కూేడా తమ నిర్ణయాన్ని ప్రభుత్వం కోర్టుకు చెప్పకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అభిప్రాయం చెప్పేందుకు హైకోర్టు 45 నిమిషాల సమయం ఇచ్చింది. ప్రభుత్వం అభిప్రాయం చెప్పకుంటే తామే ఆదేశాలిస్తామని హైకోర్టు వెల్లడించింది.