
తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాన్ కోరారు. నేడు నిరంకుశ నిజాం పాలన నుంచి రజాకార్ల దుర్మార్గాల నుంచి స్వేచ్చ పొందిన రోజు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక నుంచైనా ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవం జరపాలని విజ్ఞప్తి చేస్తున్నా అని పవన్ కల్యాణ్ అన్నారు.