TG Bus Pass Charges: తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీల పెంపు: తెలంగాన ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను పెంచింది. సాధారణ ప్రజలతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను పెంచింది. నేటి నుంచి కొత్త బస్ పాస్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. 20 శాతానికి పైగా బస్ పాస్ రేట్లను పెంచారు. రూ. 1,150 ఉన్న ఆర్డినరీ పాస్ ధరను 1,400 కు పెంచారు. 1300 ఉన్న మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ ధరను 16,00కు పెంచారు. రూ. 1,450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ను రూ. 1,800కు పెంచారు. గ్రేటర్ హైదరాబా్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను ఆర్టీసీ పెంచింది.