Family Dispute : మేఘాలయ హనీమూన్ హత్యోదంతం జరిగాక.. ఏ మొగుడు అనుమానం ఉన్న భార్యను నమ్మడం లేదు. ఎక్కడ తమను లేపేస్తారోనని కపట భార్యలను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. ఆడవాళ్ల చేష్టలు ఎక్కడిదాకా వెళ్లాయంటే ఏకంగా ప్రియుడిని వద్దన్నందుకు అతడితోనే కలిసి మొగుడిని లేపేసే స్థాయికి దిగజారింది. దీంతో ఈ సమాజం ఎటుపోతోంది? అన్న ఆందోళనలు నెలకొన్నాయి.
వివాహేతర సంబంధాలు ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య, ఆమె ప్రియుడితో కలిసి తనను చంపేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ ఓ భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం జగ్గు తండాలో చోటుచేసుకుంది.
జగ్గు తండాకు చెందిన బానోతు రమేష్, శాంతలకు సుమారు 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆటో డ్రైవర్‌గా పని చేసుకుంటూ రమేష్ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, కొంతకాలంగా శాంత అదే తండాకు చెందిన మరో ఆటో డ్రైవర్ అయిన దేవేందర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త రమేష్‌కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
ఈ వ్యవహారంపై రమేష్ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టించాడు. దీంతో ఆగ్రహానికి గురైన శాంత, ఆమె ప్రియుడు దేవేందర్ లు ఏకంగా రమేష్‌ను చంపడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఇటీవల దేవేందర్ కత్తితో రమేష్‌పై దాడి చేయడానికి ప్రయత్నించగా, రమేష్ చాకచక్యంగా తప్పించుకున్నాడు.
ఈ సంఘటనతో తీవ్ర భయాందోళనలకు గురైన రమేష్ తనకు తన భార్య శాంత, ఆమె ప్రియుడు దేవేందర్ నుండి ప్రాణహాని ఉందని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భార్యతో ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన భర్త
అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియునితో కలిసి తనని చంపేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్న భర్త. పర్వతగిరి మండలం జగ్గు తండాలో ఘటన. బానోతు రమేష్, శాంతలకు 16 ఏళ్ల క్రితం వివాహం. ఆటో డ్రైవర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న… pic.twitter.com/RkuHHKRiob
— ChotaNews App (@ChotaNewsApp) September 9, 2025