Maa Inti Bangaram: సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు 11 రోజులు అయినా ఇసుమంత కూడా తగ్గకపోవడం విశేషం. 11 వ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. దీనిని బట్టే చెప్పొచ్చు , ఈ చిత్రం లాంగ్ రన్ లో కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుంది అని. అదే కనుక జరిగితే సౌత్ ఇండియన్ సినిమాలో మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన ఏకైక లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఈ సినిమా చరిత్ర లో నిలిచిపోతుంది. ఒక నటిగా , నిర్మాతగా సమంత కి ఈ సినిమా ఇచ్చిన లాభాలు మామూలివి . ఈ లాభాలతో ఆమె మరో నాలుగు సినిమాలు చేసేయొచ్చు, కుంభస్థలం బద్దలు కొట్టడం అంటారు కదా, అదే ఈ సినిమా విషయంలో జరిగింది.
ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి 11 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 12 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రం 9 కోట్ల 48 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 42 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ చూస్తే , తమిళనాడు ప్రాంతం నుండి 1 కోటి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్ల 75 లక్షలు, ఓవర్సీస్ నుండి ఏకంగా 9 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 38 కోట్ల 31 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 77 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 12 కోట్ల రూపాయిలు మాత్రమే. ఇప్పటి వరకు దాదాపుగా 26 కోట్ల 31 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి. భవిష్యత్తులో కచ్చితంగా 30 కోట్ల లాభాల మార్కుని కచ్చితంగా అందుకుంటుంది ఈ చిత్రం. బిసినెస్ టర్మ్స్ ప్రకారం ఈ చిత్రం ఈ ఏడాది లోనే బిగ్గెస్ట్ ఆదాయాలను రప్పించిన చిత్రం గా నిలిచి , ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా స్థాయి ఇంకా పెరగొచ్చు.
