
తెలంగాణ ఉద్యమంలో ఇంజినీర్ల పాత్ర మరవలేనిదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ జలసౌధలో నిర్వహించిన తెలంగాణ ఇంజినీర్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంజినీర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ ఇంజినీర్లు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఆర్. విద్యాసాగర్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.