https://oktelugu.com/

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న అరెస్ట్

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని తనను బెదిరించాడని ఒక వ్యక్తి కొద్దిరోజుల క్రితం చిలకలగూడ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు ఠాణాకు పిలిపించి విచారణ జరిపారు. మరో కేసులో ఆయన కార్యాలయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు తనిఖీ చేశారు. సైబర్ క్రైమ్ స్టేషన్ లో రెండు, చిక్కడపల్లి, జూబ్లీహిల్స్ లో నవీన్ పై […]

Written By: , Updated On : August 28, 2021 / 07:42 AM IST
Follow us on

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని తనను బెదిరించాడని ఒక వ్యక్తి కొద్దిరోజుల క్రితం చిలకలగూడ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు ఠాణాకు పిలిపించి విచారణ జరిపారు. మరో కేసులో ఆయన కార్యాలయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు తనిఖీ చేశారు. సైబర్ క్రైమ్ స్టేషన్ లో రెండు, చిక్కడపల్లి, జూబ్లీహిల్స్ లో నవీన్ పై ఒక్కో కేసు నమోదైంది. చిలకలగూడ కేసులో శుక్రవారం రాత్రి ఆయనను అరెస్టు చేశారు.