India vs New Zealand : టి20 లలో టీమిండియా జోరు మామూలుగా. 2024 సంవత్సరంలో టి20 వరల్డ్ కప్ గెలిచిన నాటి నుంచి ఇప్పటివరకు టీమిండియా ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా.. ఇలా వరుసగా టి20 సిరీస్ లు గెలుచుకుంటూ వస్తోంది. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్ జరుగుతున్న టి20 సిరీస్ కూడా టీమిండియా గెలుచుకుంది.
గుహవాటి వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ సంజు శాంసన్(0) ఔట్ అయినప్పటికీ.. ఇషాన్ కిషన్ (28) భారీ ఇన్నింగ్స్ ఆడ లేకపోయినప్పటికీ.. సూర్య కుమార్ యాదవ్ (57*), అభిషేక్ శర్మ(68*) మెరుపు హాఫ్ సెంచరీలు చేయడంతో న్యూజిలాండ్ గురించిన 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 10 ఓవర్ల లోనే పూర్తి చేయడం విశేషం. రెండో వికెట్ కు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ 19 బంతుల్లో 53 పరుగులు జోడించారు. మూడో వికెట్ కు సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ కేవలం 40 బంతుల్లోనే 102* పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచిన టీమ్ ఇండియా.. గుహవాటి మ్యాచ్ కూడా గెలవడంతో.. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఈ గెలుపు ద్వారా టీమిండియా పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టింది. 2016 నుంచి 2018 వరకు పాకిస్తాన్ జట్టు వరుసగా 11 t20 సిరీస్ గెలుచుకుంది. ఇప్పుడు భారత్ కూడా 2024 నుంచి ఇప్పటివరకు వరుసగా 11 సిరీస్ లు దక్కించుకుంది. 2017, 20 18 కాలంలో టీమిండియా వరుసగా ఏడు సిరీస్ లు గెలిచింది. 2019 నుంచి 2021 వరకు టీం ఇండియా ఆరు సిరీస్ లు దక్కించుకుంది.
ఎఫ్ఎం (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం ఉన్న జట్లు) విభాగంలో స్వదేశంలో అత్యధిక సిరీస్ విజయాలు సొంతం చేసుకున్న జట్లలో టీమిండియా రికార్డు సృష్టించింది. 2022 నుంచి 26 వరకు స్వదేశంలో టీమిండియా 10 t20 సిరీస్ లు గెలిచింది. 2006 నుంచి 2010 వరకు ఆస్ట్రేలియా ఎనిమిది సిరీస్ లు దక్కించుకుంది. 2019 నుంచి 2022 వరకు టీం ఇండియా 7, 2008 నుంచి 2018 వరకు పాకిస్తాన్ ఐదు సిరీస్ లు గెలుచుకున్నాయి.
ఒక ఎఫ్ ఎం జట్టుపై ఇంకా ఎక్కువ బంతులు మిగిలి ఉండగానే సాధించిన విజయాల జాబితాలో టీమిండియా రికార్డు సృష్టించింది. గుహవాటి వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా ఇంకా 60 బంతులు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది. 2024 లో కింగ్ స్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పై వెస్టిండీస్ జట్టు ఇంకా 37 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. 2022లో లాహోర్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది. 2016లో జోబర్డ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ విధించిన లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ఇంకా 37 బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేసింది.