
శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమ్ ఇండియా 225 పరుగులకు ఆలౌటైంది. చమీరా వేసిన 43.1 ఓవర్ కు నవ్ దీప్ సైని (15) ఔటవ్వడంతో భారత ఇన్నింగ్స్ కు బ్రేక్ పడింది. అంతకుముందు ఓవర్ లోనే రాహుల్ చాహర్ (13) కరుణరత్నె బౌలింగ్ లో క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్ కు 29 పరుగులు జోడించడం విశేషం. దీంతో శ్రీలంక ముందు మోస్తరు లక్ష్యం ఉంచింది. భారత బ్యాట్స్ మెన్ లో పృథ్వీ షా (49) సంజూ శాంసన్ (46), సూర్యకుమార్ యాదవ్ (40) ఫర్వాలేదనిపించారు.