
సమంత రుతుప్రభు.. నుంచి సమంత అక్కినేనిగా మారిన తర్వాత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సినిమాల్లో వెబ్ సిరీస్ లలో నటిస్తూ మునుపటి కంటే ఎక్కువగా నటించేస్తోంది సమంత.
తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ తీక్షణమైన ఫొటోను షేర్ చేసింది. సీరియస్ లుక్ లో గుబురు డ్రెస్ వేసుకొని ఏదో ఆలోచిస్తున్న ఫొటోనుషేర్ చేసింది.
కేవలం ఒక లవ్ సింబల్ ను మాత్రమే దానికి జోడించింది. దాని అర్థమేంటి? సమంత ఎందుకు ఇలా కనిపించిందన్నది మాత్రం సస్పెన్స్.
పెళ్లికి ముందు వరకు కేవలం రెమ్యునరేషన్ కోసం ఏ సినిమా పడితే ఆ సినిమా చేసిన సామ్.. పెళ్లి తర్వాత మాత్రం, తనకు నటిగా గుర్తింపును ఇచ్చే పాత్రలే చేస్తూ ముందుకు పోతుంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ మేన్ సిరీస్ లో విలన్ గా కూడా నటించి అలరించింది. కానీ ఎప్పటి నుండో సమంతకి ఒక కోరిక ఉంది. అవును, మహారాణి పాత్రలో కనిపించాలని.
మొత్తానికి సామ్ కోరికను గుణశేఖర్ తీరుస్తున్నాడు. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తోన్న శాకుంతలం సినిమాలో సామ్ కొన్ని నిమిషాల పాటు మహారాణి లుక్స్ లో కనిపించబోతుంది.
https://www.instagram.com/p/CRqQOlHJaw0/?utm_source=ig_web_copy_link