అమరావతి, అంతర్వేది సహా అన్ని అంశాలపై సిబిఐ దర్యాప్తునకు ప్రభుత్వం రెడీగా ఉందని కానీ దీనికి టీడీపీ నేతలు భయపడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ బ్రహ్మానందరెడ్డి అన్నారు. అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో చర్యలను నిలిపివేస్తూ హై కోర్ట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టులో సవాల్ చేయనుంది.