
అరేబియా సముద్రంలో బీభత్సం సృష్టించిన తౌక్టే అతి తీవ్ర తుఫాను గుజరాత్ లో భారీ ప్రాణ నష్టం కలిగించింది. ఈ తుపాను ప్రభావంతో 12 జిల్లాల పరిధిలో దాదాపు 45 మంది మరణించారు. సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలి జిల్లాలోనే 15 మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ లోని దీవ్ ఉనా మధ్య సోమవారం అర్ధరాత్రి తుపాను తీరాన్ని దాటిందని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. భావనగర్, గిర్ సోమనాథ్ కోస్టల్ జిల్లాలో ఎనిమిది మంది చోప్పున మరణించినట్లు అధికారులు వెల్లడించారు. లాగే అహ్మదాబాద్ లో ఐదుగురు, ఖేడాలో ఇద్దరు, ఆనంద్, వడోదర, సూరత్, వల్సాద్, రాజ్ కోట్, నవ్ సరి, పంచమహల్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారన తెలిపారు.