
లాక్ డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు తెలంగాణ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు సాధారణ సమయాల్లో తెరిచేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధాన్యం సేకరణ, మిల్లులకు రవాణ చేయడం తదితర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్ఫష్టం చేసింది. జాతీయ రహదారుల వెంబడి ఉన్న పెట్రోల్ బంకులకు లాక్ డౌన్ నుంచి ఇప్పటికే పూర్తి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.