Homeటాప్ స్టోరీస్TANA Heart Health Webinar 2026 : గుండె చప్పుడు ఆగిపోకముందే... మేల్కొందాం!

TANA Heart Health Webinar 2026 : గుండె చప్పుడు ఆగిపోకముందే… మేల్కొందాం!

TANA Heart Health Webinar 2026 : జీవితం అంటే కేవలం గడిచిపోయే రోజులు కావు.. అది మనం పంచుకునే నవ్వులు.. కనే కలలు. కానీ ఆ నవ్వుల వెనుక ఒక నిశ్శబ్ద శత్రువు పొంచి ఉంది. నిన్న మనతో సరదాగా కబుర్లు చెప్పిన మిత్రుడు.. నేడు లేడన్న వార్త విన్నప్పుడు కలిగే శూన్యం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నేటి యువ భారతీయుల్లో పెరిగిపోతున్న హార్ట్ అటాక్స్, సడన్ కార్డియాక్ అరెస్టులు మన జీవన గమనాన్ని ప్రశ్నిస్తున్నాయి.

ఎక్కడ జరుగుతోంది పొరపాటు?

ఆధునిక జీవనశైలిలో మనం పరుగు తీస్తున్నాం కానీ, మన ప్రాణానికి మూలమైన గుండె గురించి ఆలోచించడం మరచిపోతున్నాం. మితిమీరిన పని ఒత్తిడి, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, సరైన విశ్రాంతి లేకపోవడం… ఇవే మన గుండెను బలహీనపరుస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా విరుచుకుపడుతున్న ఈ ముప్పు నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ‘అవగాహన’ ఒక్కటే మనకున్న అసలైన ఆయుధం.

మీ ప్రాణానికి ఒక భరోసా: తానా హెల్త్ వెబినార్

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఈ హార్ట్ హెల్త్ మంథ్ ( Heart Health Month) సందర్భంగా సమాజ శ్రేయస్సు కోసమే తానా మరియు లీడ్ ద పాత్ ఫౌండేషన్ ( Lead The Path Foundation) సంయుక్తంగా ఈనెల 22న ఆదివారం ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. మీ గుండె ఆరోగ్యంపై మీకు సరైన అవగాహన కల్పించడానికి నిపుణులు మీ ముందుకు వస్తున్నారు.

కార్యక్రమ వివరాలు..

విషయం: తానా హెల్త్ వెబినార్ (Heart Health & Prevention)

తేదీ: ఫిబ్రవరి 22, 2026

సమయం: భారతదేశంలో: రాత్రి 10:30 గంటలకు

అమెరికా & కెనడా: ఉదయం 11:00 (Central Time)

వేదిక: జూమ్ (Zoom) ద్వారా ఆన్‌లైన్

Meeting ID: 813 4008 3126

Passcode: 260498

Link: https://us06web.zoom.us/j/81340083126 ఇక్కడ క్లిక్ చేయండి

ఈ వెబినార్ మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది?

ప్రతి నిమిషం విలువైనదే. ఈ ఒక గంట సమయం మీ ప్రాణాన్ని నిలబెట్టే జ్ఞానాన్ని అందిస్తుంది. హెచ్చరిక సంకేతాలు ఉంటాయి.. శరీరం ఇచ్చే ముందస్తు సంకేతాలను కనిపెట్టడం ఎలా? యువతలో పెరుగుతున్న గుండె సమస్యలను అడ్డుకోవడానికి మార్గాలు. ఈనెల 22న నిపుణులు కీలకమైన సూచనలు ఇస్తారు. మీ అలవాట్లను ఎలా మార్చుకోవాలి? ఇలాంటి సూచనలతో వెబినార్ లో అవగాహన కల్పించనున్నారు..

వచ్చేవారం 22వ తేదీ జరుగనున్న ఈ గొప్ప కార్యక్రమాన్ని ‘తానా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ డా. ఉమా.ఆర్.కటికి (ఆరమండ్ల) గారు ముందుండి నడిపిస్తున్నారు… వీరికి తానా ప్రెసిడెంట్ నరేన్ కొడాలి గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు గారు మరియు తానా లీడర్ షిప్ సహకారం అందించనున్నారు.

ప్రాణం అమూల్యమైనది. దాన్ని అశ్రద్ధ చేయవద్దు. మీ కుటుంబం కోసం, మీ బంగారు భవిష్యత్తు కోసం ఒక్క గంట కేటాయించండి. గుర్తుంచుకోండి.. మనం మేల్కొంటేనే మన గుండె చప్పుడు నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular