Tamil Nadu Man: హీరో సూర్య నటించిన 7th సెన్స్ మూవీ చూశారా అందులో పురాతన బోధిధర్ముడి జన్యువులు ఆధునిక యుగంలో హీరోలోనూ ఉంటాయి. సరిగ్గా అలాంటి ఘటనే నిజజీవితంలోనూ జరిగింది. మధురైకి చెందిన విరుమాండి ఆండి తేవర్ అనే వ్యక్తి డీఎన్ఏ లో 70 వేల ఏళ్లనాటి జీన్స్ ను సైంటిస్టులు గుర్తించారు. అతను ప్రాచీన మానవ చరిత్రకు సజీవ వారుసుడని తెలిపారు. ఈ విషయాన్ని 2008లోనే కనుగొన్నప్పటికీ, ఈ పరిశోధన గురించి చాలా మందికి తెలీదు.