Kuberaa: ధనుష్ హీరోగా నటించిన కుబేర సినిమా రేపు రిలీజ్ కానుండగా ఇందులోని క్యారెక్టర్లపై హీరో నాగార్జున ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ఈ చిత్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా ఎంతో సంతోషంగా ఉండే పాత్రలో ధనుష్ నటించారు. మధ్యతరగతికి చెందిన వ్యక్తి గందరగోళ పరిస్థితిలో ఉండే పాత్రలో నేను కనిపిస్తానని తెలిపారు. బిలియనీర్ అయినప్పటికి సంతోషమే లేని వ్యక్తి పాత్రను జిమ్ సర్ఫ్ పోషించారు అని నాగార్జున తెలిపారు.