Tamil Nadu elections 2026 : తమిళనాడు ఓటర్లు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల తేదీని కాసేపటి క్రితమే ప్రకటించింది ఎన్నికల కమిషన్. ఈ ఎన్నికలను ఏప్రిల్ 23 న జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలపై కేవలం తమిళనాడు ప్రజలు మాత్రమే కాదు, దేశం మొత్తం ఫోకస్ పెట్టింది. ఎందుకంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఎలా అయినా గెలవాలి అనే కసితో ఉన్నారు. దానికి తోడు తమిళ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ విజయ్ TVK పార్టీ ని స్థాపించి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. మరి ఆయన ఎమ్మెల్యే గా పోటీ చేసే స్థానం లో గెలుస్తాడా లేదా ?, ఆయన పార్టీ కి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఎంత ఓటు షేర్ రాబోతుంది అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా లో కూడా దీనిపై ప్రతీ రోజు చర్చలు నడుస్తూనే ఉన్నాయి.
ఎన్నికల తేదీ ప్రకటించేశారు కాబట్టి, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. ఇక సీఎం స్టాలిన్ ప్రస్తుతానికి ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే, ఎలాంటి పవర్స్ ఉండవు. ప్రస్తుతం ఉన్న సర్వేల ప్రకారం చూస్తే అధికారం లో DMK పార్టీ నే మరోసారి 41 శాతం కి పైగా ఓటింగ్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని తెలుస్తోంది. ఇక NDA కూటమి (అన్నా DMK + బీజేపీ) కి 36 శాతం కి పైగా ఓటింగ్ వస్తుందని సర్వేలు చెప్తున్నాయి. మరి ఇది జరుగుతుందా లేదా అనేది చూడాలి. ఇక ప్రతీ రోజు టీవీ చానెల్స్ లో సర్వేల పేరుతో ప్రత్యేక ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతూనే ఉంటాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తమిళనాడు లో ప్రచారం అవుతున్న ఒక వార్త సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది.
అదేమిటంటే NDA కూటమిలోకి విజయ్ TVK పార్టీ కూడా త్వరలోనే చేయబోతుంది అనేది. బీజేపీ పెద్దలతో పాటు, మన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై విజయ్ తో చర్చించారని, ప్రస్తుతానికి ఈ చర్చలు చివరి దశలో ఉన్నాయని, తనకు రెండున్నర ఏళ్ళ పాటు సీఎం పదవి ఇస్తే NDA లో చేరడానికి ఎలాంటి అభ్యంతరం లేదని విజయ్ చెప్పినట్టు తెలుస్తోంది. మరి అందుకు NDA ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే NDA విజయ్ కి ఉప ముఖ్యమంత్రి పదవి, అదే విధంగా TVK పార్టీ కి 80 స్థానాలు ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ డీల్ కి విజయ్ ఒప్పుకోలేదని సమాచారం. చూడాలి మరి రాబోయే రోజుల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.