
ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ తాలిబన్లకు సవాలు విసురుతున్నారు. వాళ్లపై తిరుగబాటు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ కు మింగేసేంత సీన్ పాకిస్థాన్ కు, పాలించేంత సీన్ తాలిబన్లకు లేదని అమ్రుల్లా సవాలు విసిరారు. ఉగ్ర మూకలకు తలవంచొద్దని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశాలు చట్టాలను గౌరవించాలి తప్ప హింసను కాదు. మీ చరిత్రలో అవమానాలకు, ఉగ్ర మూలకు తలవంచారన్న తలవంపులకు తావు లేకుండా చూసుకోండి అని అమ్రుల్లా సలేహ్ ఆప్ఘన్ ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ లో ప్రస్తుతం తాలిబన్ల చేతుల్లో పడకుండా ఉన్న పంజ్ షిర్ లోయ నుంచే అమ్రుల్లా తిరుగుబాటు ప్రారంభించారు.