
అఫ్గానిస్తాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు కశ్మీర్, భారత్ లేదా మరో ఇతర దేశంలో ముస్లింల హక్కులపై మాట్లాడి తీరుతామంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు. ముస్లింల సమస్యలపై స్పందించే హక్కు తమ కుందన్నారు. తాలిబన్ల పాలనలో అఫ్గన్ భూభాగం దేశంలో వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడుతుందనే ఆందోళనల మధ్య తాజా వ్యాఖ్యలు మరింత కలవరం రేపుతున్నాయి.