T20 World Cup 2026 : వచ్చే ఏడాది పొట్టి ప్రపంచ కప్ జరగనుంది. ఈసారి జరిగే పొట్టి ప్రపంచ కప్ కి చాలా విశేషం ఉంది. ఎందుకంటే ఈసారి అంతకుమించి అనే స్థాయిలో జట్లు పోటీ పడుతున్నాయి. పొట్టి ప్రపంచ కప్ గెలుచుకోవడానికి నువ్వా నేనా అన్నట్టుగా సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి కొన్ని జట్లను ఎంపిక చేయగా.. నిన్నటి వరకు జరిగిన క్వాలిఫైయర్ పోటీలలో.. కొన్ని జట్లు విజయాలు సాధించి ఐసీసీ మనసును గెలుచుకున్నాయి. తద్వారా వచ్చే ఏడాది శ్రీలంక, భారత్ వేదికగా జరిగే పొట్టి ప్రపంచ కప్ లో పోటీపడేందుకు చాలా జట్లు సిద్ధమవుతున్నాయి.

2024 లో అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా టి20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చాయి. ఈసారి భారత్, శ్రీలంక వేదికగా టి20 వరల్డ్ కప్ జరగనుంది. టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఆడే జట్లపై ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. ఈసారి ఏకంగా 20 జట్లు టి20 వరల్డ్ కప్ లో పోటీపడేందుకు అర్హత సాధించాయి.. ఐసీసీ వెల్లడించిన వివరాల ప్రకారం భారత్, శ్రీలంక, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఇటలీ, కెనడా, న్యూజిలాండ్, ఐర్లాండ్, ఒమన్, నమీబియా, నెదర్లాండ్స్, జింబాబ్వే, నేపాల్, యూఏఈ జట్లు అర్హత సాధించాయి. శ్రీలంక, భారత్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఆ జట్లకు నేరుగానే ప్రవేశం లభించింది. అయితే ఈసారి ఇటలీ, కెనడా, నేపాల్ జట్లు టి20 వరల్డ్ కప్ లో తలపడుతున్నాయి.
గురువారం జపాన్ దేశంతో జరిగిన మ్యాచ్లో యూఏఈ విజయం సాధించిన నేపథ్యంలో t20 వరల్డ్ కప్ కు అర్హత సాధించింది. తద్వారా ఈ టోర్నీలో పోటీపడే జట్ల సంఖ్య 20 కి చేరింది. వాస్తవానికి నిన్నటి వరకు టి20 వరల్డ్ కప్ లో పోటీపడే జట్ల సంఖ్య 19 వరకు ఉంది. ఇప్పుడు ఆ సంఖ్య 20 కి జరిగింది. క్వాలిఫైయర్ మ్యాచ్లో జపాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. ఆ తర్వాత ఈ టార్గెట్ ను యూఏఈ 12.1 ఓవర్లలో ఫినిష్ చేసింది.. తద్వారా టి20 వరల్డ్ కప్ లో ఆడేందుకు అర్హత సాధించింది. గత ఏడాది వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇచ్చిన టి20 వరల్డ్ కప్ ను టీమిండియా సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టును భారత్ ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది.