
బక్రీద్ పండుగ కు కేరళ ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడిలించింది. వ్యాపారస్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన పై ఇవాళ సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. కేరళ ప్రభుత్వ వైఖరిని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. బక్రీద్ పండుగ కోసం కోవిడ్ నిబంధనలను సడలించడం పై ఆ రాష్ట్ర ప్రభుత్వం పై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేయడం వల్ల కొత్తగా ఏవైనా ఇన్ఫెక్షన్లు పెరిగితే, అలాంటి ఘటనలకు కోర్టు ముందుకు తీసుకువస్తే అప్పడు కేరళపై చర్యలు తీసుకుంటామని సుప్రీం వెల్లడించింది.