మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలోని మరాఠా సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం వెల్లడించింది. ఆర్థిక, సామాజిక వెనకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వబడిందని వివరించింది. గతేడాది మరాఠాలకు మహారాష్ట్ర సర్కార్ ఉద్యోగాల్లో 12 శాతం కోటా కల్పించింది. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పై వివిధ రాష్ట్రల అభిప్రాయాలను సుప్రీం కోరింది. 50 శాతం రిజర్వేషన్ పరిమితి నిర్ణయం పై పునపరిశీలన అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసింది.