
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న పెగాసస్ తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ వ్యవహారంపై దాఖలైన పలు పిటిషన్లను శుక్రవారం స్వీకరించింది. పనిభారాన్ని బట్టి వచ్చేవారం వాటిపై విచారణ చేపట్టనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ వెల్లడించారు. పెగాసస్ పై మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు పెగాసస్ తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.