
జార్ఖండ్ జడ్జి మృతి కేసుపై సుప్రీంకోర్టు స్పందించింది. వారంలోపు నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా జార్ఖండ్ ఏజీని వచ్చేవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ధన్ భాద్ లో ఉదయం జాగింగ్ కు వెళ్లిన జడ్జి ఉత్తమ్ ఆనంద్ ను దుండగులు ఆటోతో ఢీకొట్టగా.. ఆయన మృతి చెందిన విషయం విదితమే.