Kamal Haasan Thug Life: థగ్ లైప్ చిత్రానికి సుప్రీంకోర్టులో ఊరట లబించింది. కమల్ హాసన్ నటించిన ఈ సినిమా కర్ణాటకలోనూ విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కన్నడ భాషపై క మల్ చేసిన వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో ఈ సినిమాను కర్ణాటకలో నిషేదించిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్ర యూనిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా నేడు ఆదేశాలు జారీ చేసింది. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల వల్ల ఆ సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను సుప్రీంకోర్టు హెచ్చరించింది.