Shocking Rumours About Kingdom Movie: విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి విడుదల కష్టాలు తప్పవు అనేది తాజా సమాచారం. ఈ మేరకు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది. కింగ్ డమ్ పై కొన్ని షాకింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
అర్జున్ రెడ్డి మూవీతో స్టార్ హోదా రాబట్టాడు విజయ్ దేవరకొండ(VIJAY DEVARAKONDA). గీత గోవిందం ఆయన ఇమేజ్ మరో స్థాయికి తీసుకెళ్లింది. టైర్ టు హీరోల్లో విజయ్ దేవరకొండ టాప్ లోకి వచ్చాడు. అయితే విజయ్ దేవరకొండకు భారీ హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన చిత్రాలేవీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. ఖుషి మాత్రమే పర్లేదు అనిపించింది. ఇక విజయ్ దేవరకొండ గత చిత్రం ది ఫ్యామిలీ స్టార్ పరాజయం పాలైంది. గీత గోవిందం కాంబోలో వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.
ఓ బ్లాక్ బస్టర్ కొట్టి రేసులోకి దూసుకురావాలని విజయ్ దేవరకొండ కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన నటించిన కింగ్ డమ్ ఆ కోరిక నెరవేరుస్తుందని గట్టిగా నమ్ముతున్నాడు. జెర్సీ మూవీతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కింగ్ డమ్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. కింగ్ డమ్(KINGDOM) లో విజయ్ దేవరకొండ లుక్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. అలాగే ప్రోమోలకు విపరీతమైన రెస్పాన్స్ దక్కింది. కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది.
Also Read: Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ సినిమా పరిస్థితి ఏంటి..?రిలీజ్ డేట్ మార్చారా..?
కింగ్ డమ్ జులై 4న థియేటర్స్ లోకి వస్తున్నట్లు ప్రకటించారు. కానీ తేదీకి సినిమా థియేటర్స్ లోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. కింగ్ డమ్ టీమ్ ఎలాంటి ప్రమోషన్స్ షురూ చేయలేదు. కింగ్ డమ్ మూవీలోని కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేశారని టాక్. అలాగే ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం కూలీ మూవీతో బిజీగా ఉన్నారట. సౌత్ లో హాట్ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న అనిరుధ్.. వెయిట్ చేయాల్సిందే అని నిర్మొహమాటంగా చెప్పాడట. మరోవైపు పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు(HARI HARA VEERAMALLU) జులై 18న విడుదల చేస్తారనే వాదన ఉంది. అదే నిజమైతే కింగ్ డమ్ ని జులై 25న విడుదల చేయాలి.
అప్పటి కూడా గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేయడం కష్టమే అంటున్నారు. లేదా ఆగస్టు 1న విడుదల చేద్దాం అంటే, రెండు వారాల వ్యవధిలో కూలీ, వార్ 2(WAR 2) వంటి భారీ చిత్రాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. మొత్తంగా కింగ్ డమ్ సినిమాకు విడుదల కష్టాలు తప్పవు అంటున్నారు. ఈ క్రమంలో కింగ్ డమ్ రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కింగ్ డమ్ చిత్రాన్ని నాగ వంశీ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.