
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు, పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు గోవాలో అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని సీబీఐ అధికారికంగా ధృవీకరించింది. నిన్న సాయంత్రం గోవాలో అరెస్ట్ చేసిన అధికారులు ఇవాళ గోవా స్థానిక కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్ రిమాండ్ లోకి తీసుకున్నారు. గోవా నుంచి కడపకు తీసుకువచ్చి బుధవారం కోర్టులో ప్రవేశపెట్టానున్నారు.