
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెెస్టిగేషన్ డైరెక్టర్ గా ఇవాళ ఐపీఎస్ సుబోద్ కుమార్ జైస్వాల్ బాధ్యతలు స్వీకరించారు. సీబీఐ డైరెక్టర్ గా ఆయన రెండేళ్ల పాటు తన విధులు నిర్వర్తించనున్నారు. మహారాష్ట్ర క్యాడర్, 1985 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన జైస్వాల్ ప్రస్తుతం సీఐఎస్ ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. గతంలో మహారాష్ట్ర డీజీపీగా పని చేశారు. సీబీఐ డైరెక్టర్ గా రెండేండ్ల పాటు పనిచేసిన రిషి కుమార్ శుక్లా ఫిబ్రవరి 3న పదవీ విరమణ చేశారు.