
హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో చెట్లు కొట్టొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రహదారుల అభివృద్ధికి పార్కులో చెట్లను కొట్టేస్తున్నామని దాఖలైన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు పార్క్ లో నరికిన చెట్ల రకాలు, వయసు వివరాలు తెలపాలని సంబంధిత శాఖ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.