
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఉదయం భారీ లాభాల్లో ట్రేడింగ్ ను మొదలు పెట్టాయి. ఉదయం 9.20 సమయంలో 114 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,747 వద్ద, 405 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 52,604 వద్ద కొసాగుతున్నాయి. ఐడీసీఎల్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, అల్కార్గో లాజిస్టిక్స్, జుబ్లియంట్ ఫుడ్ వర్క్, ఇండియన్ ఓవర్సీస్ షేర్ల విలువ పెరగ్గా.. పోలికాబ్ ఇండియా, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ పవర్, లక్ష్మీ మిషిన్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ షేర్ల ధరలు కుంగాయి.