
దేశీయ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు సూచీలకు అండగా నిలుస్తున్నాయి. సెన్సెక్స్ 53వేల మార్క్ ను దాటగా నిఫ్టీ 15,800 పైన కదలాడుతోంది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 120 పాయింట్ల లాభంతో 53,024 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 15,885 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.