మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు సెట్ చేసుకుంటున్నాడు. భవిష్యత్తు మొత్తం పాన్ ఇండియా చుట్టూ తిరగనుంది. అందుకే చరణ్ కూడా ముంబైలో కొత్త ఇల్లు కొన్నారట. ఈ వార్త ఎప్పటి నుండో వినిపిస్తున్న అది ఇన్నాళ్లు రూమర్ గానే చలామణి అయింది. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో చరణ్ ఇల్లు కొన్నారు.

పైగా బీచ్ ఫేసింగ్ తో అత్యంత అధునాతన వసతులతో ఓ విశాలమైన విల్లాని చరణ్ కొనుగోలు చేశారు. గత నెలలో ఆ ఇంట్లో తన సతీమణి ఉపాసనతో కలిసి గృహప్రవేశం కూడా చేశారని టాక్. చరణ్ – ఉపాసన తమ టేస్ట్ కి తగ్గట్టు ఈ విల్లాలో అన్ని సౌకర్యాలు సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ కొటారి ఆరు నెలలు శ్రమించి చాలా గ్రాండ్ గా ఈ ఇంటిని తీర్చిదిద్దారు.

అయితే చరణ్ ఇలా ఉన్నట్టు ఉండి ముంబైలో ఇల్లు కొనడానికి కారణం… ఇటీవల చరణ్ షూటింగ్ నిమిత్తం ఎక్కువగా ముంబై వెళ్లాల్సి వస్తోంది. వెళ్లిన ప్రతిసారీ అక్కడ హోటల్స్ లో దిగాలంటే ఎంతైనా ఇబ్బందే. అదే చక్కగా సొంత ఇల్లు ఉంటే బాగుంటుందనే ఆలోచనతో చరణ్ ఈ ముంబై ఇంటిని కొనుగోలు చేశాడు.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలు ఇవే అంటూ సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తున్నాయి. ఇంటి లోపల కనిపిస్తున్న ఖరీదైన ఫర్నిచర్ గ్రాండియర్ లుక్ తో అదిరిపోయింది.
