
దేశీయ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. రోజంతా ఒడుదొడుకుల్లో సాగిన సూచీలు చివరకు బ్యాంకింగ్, ఐటీ షేర్లు అండగా నిలిచాయి. ఈరోజు సెన్సెక్స్ 125.13 పాయింట్లు లాభంతో 54,502,85 వద్ద, నిఫ్టీ 20.05 పాయింట్లు లాభపడి 16,258,25 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీలో మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు రాణించాయి. సెన్సెక్స్ ఒక దశలో 54,585 వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది.