
దేశీయ స్టాక్ మార్కెట్ నూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ఊగిసలాటతో ప్రారంభమైన సూచీలు ఓ దశలో లాబాల్లోకి జారుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ నుంచి లభించిన మద్దతును రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాలు తగ్గించాయి. దీంతో సూచీలు తిరిగి నష్టాల్లోకి జారుకొని ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. చివరకు సెన్సెక్స్ 123 పాయింట్ల నష్టంతో 52, 852 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 15,824 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.42 వద్ద నిలించింది.