Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆరంభంలోనే తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యయి. ఐటీ, ఫైనాన్షియల్ షేర్ల లో అమ్మకాలు సూచీలను కిందకు లాగాయి. గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ దీనికి తోడైంది. దీంతో ఆరంభంలో లాభాల్లో కదలాడిన సూచీలు చివరకు నష్టాల్లో ముగిశాయి. 636 పాయింట్ల నష్టంతో 80,737 వద్ద ముగిసింది. నిఫ్టీ 174 పాయింట్ల నష్టంతో 24,542,50 వద్ద ముగిసింది.