AP Ration Card Benefits : గత ప్రభుత్వ హయాంలో ఎండియు వాహనాల ద్వారా ఇంటి దగ్గరకే వచ్చి రేషన్ సరుకులను పంపిణీ చేసేవారు. అయితే ప్రస్తుతం పాలనలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాత విధానాన్ని రద్దు చేస్తూ రేషన్ షాపుల ద్వారానే రేషన్ సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం జూన్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం అయ్యింది. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలు జరగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక చర్యలను కూడా తీసుకుంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం అన్ని రేషన్ షాపుల దగ్గర క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి ఏవైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే స్కాన్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా రేషన్ కార్డు లబ్ధిదారులను కోరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డు ఉన్నవారికి ఒక మంచి గుడ్ న్యూస్ తెలిపింది.
Also Read : తెలంగాణలో రేషన్ కార్డుల రద్దు.. ఆ కార్డులపై కేంద్రం దృష్టి!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ షాపుల ద్వారా జూన్ 1వ తేదీ నుంచి రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభం అయ్యింది. గతంలో ఎండియు వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ జరిగేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత విధానంలో రేషన్ బియ్యం పక్కదారి పడుతుందని భావించి రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.ఆదివారం నుంచి రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రోజే 18 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు ద్వారా రేషన్ సరుకులు తీసుకున్నారు. అలాగే రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు కూడా జరగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు చేపట్టింది. రేషన్ కార్డు ఉన్నవారికి ఉపయోగపడేలాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా ప్రకటించింది.
దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ప్రతి రేషన్ షాపు దగ్గర కూడా పూర్తి వివరాలతో ఉన్న సమాచార బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ బోర్డులో ఆ రేషన్ షాప్ కి సంబంధించిన రేషన్ డీలర్ అలాగే అధికారుల వివరాలు అన్నీ ఉంటాయి. క్యూఆర్ కోడ్ కూడా ఇందులో ఉంటుంది. రేషన్ కార్డు ఉన్నవారికి ఏవైనా సమస్యలు ఉంటే వాళ్ళు తమ ఫోన్ లో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ఫిర్యాదు చేసిన కేవలం 24 గంటలలోనే ఫిర్యాదు పై అధికారులు స్పందిస్తారని ప్రభుత్వం తెలిపింది. అలాగే కేవలం 24 గంటలలో ఆ ఫిర్యాదు పై పరిష్కారం చేసే విధంగా చర్యలు కూడా తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.