
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో గతవారం నష్టాల్లో నడిచిన మార్కెట్లు ఎట్టకేలకు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 363 పాయింట్ల లాభంతో 52,950 వద్ద స్థరపడింది. నిఫ్టీ 122 పాయింట్లు లాభపడి 15,885 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.32 వద్ద నిలిచింది.