
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమంగా లాభాల్లోకి ఎగబాకాయి. ఐటీ, సాంకేతిక, లోహ, పారశ్రామిక రంగాల నుంచి సూచీలకు మద్దతు లభించింది. దీంతో చివరకు సెన్సెక్స్ 132 పాయింట్ల లాభంతో 52,904 వద్ద స్థిరపడింది. నిష్టీ 41 పాయింట్లు లాభపడి 15,853 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.59 వద్ద నిలిచింది.