తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు నూతన రేషన్ పత్రాలను అందజేశారు. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ఇందులో భాగంగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన ఆహార భద్రతా కార్డులను ఇస్తున్నట్లు చెప్పారు. రాబోయే వారం రోజుల్లో అర్హులైన అందరికీ కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రేషన్ కార్డులను […]
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు నూతన రేషన్ పత్రాలను అందజేశారు. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ఇందులో భాగంగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన ఆహార భద్రతా కార్డులను ఇస్తున్నట్లు చెప్పారు. రాబోయే వారం రోజుల్లో అర్హులైన అందరికీ కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రేషన్ కార్డులను అందజేశారు.