NTR : నందమూరి ఫ్యామిలీ నుంచి మరో ఎన్టీయార్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్న స్టార్ డైరెక్టర్…

అందుకే హరికృష్ణ తో లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి సూపర్ డూపర్ సక్సెస్ ఫుల్ చిత్రాలను కూడా తీశాడు. దానివల్లే ఆయన నందమూరి ఫ్యామిలీకి మరింత దగ్గరయ్యడనే చెప్పాలి. ఇక మరోసారి నందమూరి హీరో తోనే తను సినిమా చేయడం అనేది విశేషమనే చెప్పాలి.

Written By: NARESH, Updated On : March 27, 2024 8:44 am

Star director introducing another NTR from Nandamuri family to the industry

Follow us on

NTR : సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్లకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. వైవిఎస్ చౌదరి దేవదాసు లాంటి సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కూడా కొనసాగాడు.

ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడం వల్ల ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో లేకుండా పోయాడు. ఇక ఇప్పుడు మళ్లీ ఆయన ఒక సాలిడ్ హిట్ కొట్టాలనే కాన్సెప్ట్ తో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే నందమూరి హరికృష్ణ పెద్ద కొడుకు అయిన జానకిరామ్ కొడుకు ను హీరోగా పరిచయం చేసే బాధ్యతని వైవిఎస్ చౌదరి స్వీకరించినట్టుగా తెలుస్తుంది. ఇక జానకి రామ్ కొడుకు పేరు కూడా ‘ఎన్టీఆర్ ‘ అవడం విశేషం…

ఇక మొత్తానికైతే ఇండస్ట్రీకి మూడో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నాడనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమాతో వైవిఎస్ చౌదరి మరొకసారి తన మార్క్ తో మంచి విజయాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రేయ్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయ్యాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా మరో సినిమా చేయకుండా దాదాపు 10 సంవత్సరాల పాటు ఖాళీగానే ఉంటున్నాడు. మరి ఇలాంటి సమయంలో ఈయన చేతిలో నందమూరి వారసుడిని పెట్టడం అనేది కూడా కరెక్టేనా అని నందమూరి అభిమానులైతే వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే వైవిఎస్ చౌదరి కి నందమూరి ఫ్యామిలీ మీద చాలా ఇష్టం ఉంటుంది.

అందుకే హరికృష్ణ తో లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి సూపర్ డూపర్ సక్సెస్ ఫుల్ చిత్రాలను కూడా తీశాడు. దానివల్లే ఆయన నందమూరి ఫ్యామిలీకి మరింత దగ్గరయ్యడనే చెప్పాలి. ఇక మరోసారి నందమూరి హీరో తోనే తను సినిమా చేయడం అనేది విశేషమనే చెప్పాలి.