
మరికొద్దిసేపట్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు కెప్టెన్ డాసున్ శనక తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత జట్టు బ్యాటింగ్ కు దిగనుంది. ఇంతకుముందు జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి నుంచి మూడు టీ20 ల సిరీస్ ప్రారంభమైంది.