Sunrisers Hyderabad : ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ జట్టుకు యజమానియా కావ్య కొనసాగుతున్నారు. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. ఇక మీడియాలో ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కావ్య తండ్రి కళానిధి మారన్ సన్ నెట్వర్క్ కు అధిపతిగా ఉన్నారు. సన్ నెట్వర్క్ కు దక్షిణాది రాష్ట్రాలలో విపరీతంగా చానల్స్ ఉన్నాయి. కావ్య సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు యజమానియా కొనసాగుతున్నారు. ఐపీఎల్ లో ఆటగాళ్ల కొనుగోలు.. ఇతర వ్యవహారాలలో కావ్య తనదైన మార్క్ చూపిస్తారు..
2026 సీజన్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం ఇప్పటికే కావ్య సిద్ధమయ్యారు. అద్భుతమైన ఆటగాళ్లతో జట్టును తీర్చిదిద్దారు. ఐపీఎల్ లో బ్యాటింగ్ పరంగా హైదరాబాద్ జట్టుకు ఎటువంటి ఇబ్బంది లేదు. హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్ వంటి ప్లేయర్లతో హైదరాబాద్ జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది. బౌలింగ్లోనే హైదరాబాద్ జట్టు కాస్త బలహీనంగా ఉంది. గత సీజన్లో హైదరాబాద్ బౌలింగ్ బలహీనతలు బయటపడ్డాయి. కమిన్స్ సారధిగా ఉన్నప్పటికీ.. అతడికి బలమైన సపోర్ట్ లేకపోవడంతో హైదరాబాద్ జట్టు బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది.
అయితే హైదరాబాద్ జట్టు ఇటీవల జరిగిన మినీ వేలంలో బీహార్ యంగ్ పేస్ బౌలర్ సాకిబ్ హుస్సేన్ ను కొనుగోలు చేసింది. హుస్సేన్ ప్రాక్టీస్లో దుమ్ము రేపుతున్నాడు. ముఖ్యంగా వెటరన్ ఫినిషర్ దినేష్ కార్తీక్ కు చుక్కలు చూపించాడు. అతని బౌలింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ జట్టుకు వజ్రాయుధం లాంటి బౌలర్ దొరికాడని కామెంట్లు చేస్తున్నారు. కావ్య అద్భుతమైన ఆలోచనతో ఇతడిని జట్టులోకి తీసుకుందని.. దానికి తగ్గట్టుగా ప్రతిఫలం 2026 సీజన్లో హైదరాబాద్ జట్టుకు లభిస్తుందని జోస్యం చెబుతున్నారు.
ఇటీవల జరిగిన మినీ వేలంలో కావ్య అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. అండర్ డాగ్ ప్లేయర్లను కొనుగోలు చేశారు. జట్టుకు భారంగా ఉన్నవారిని వదిలేశారు. తద్వారా 2026 సీజన్ కు సరికొత్త జట్టును రూపొందించారు. ఈ జట్టుతో 2026 సీజన్లో ట్రోఫీని అందుకోవాలని కావ్య బలంగా భావిస్తున్నారు. దానికంటే ముందుగానే ప్రణాళికలను రూపొందించారు. వాటిని అమలులో పెట్టారు కావ్య.
మెరుపు వేగంతో బౌలింగ్.. SRH కుర్రాడే!
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున బరిలోకి దిగనున్న బీహార్ యంగ్ పేసర్ సాకిబ్ హుస్సేన్ నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్నారు. ప్రాక్టీస్లో భాగంగా వెటరన్ ఫినిషర్ దినేశ్ కార్తీక్‌ను తన వేగంతో బెంబేలెత్తించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ… pic.twitter.com/gTUTVp4Zae
— ChotaNews App (@ChotaNewsApp) January 6, 2026