
రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకా ధరను అపోలో హాస్పిటల్ ప్రకటించింది. ఒక డోసు స్పుత్నిక్ వీ టీకాను రూ. 1195 కు ఇవ్వనున్నట్లు అపోలో గ్రూపు అధికారి ఒకరు తెలిపారు. జూన్ రెండవ వారం నుంచి దేశంలోని అన్ని అపోలో హాస్పిటళ్లలో ఈ టీకాలను ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ కు రూ. 995 చార్జ్ చేస్తామని, ఇక అడ్మినిస్టేషన్ ఫీజుగా మరో రూ. 200 వసూల్ చేస్తామని చెప్పారు. అపోలో హాస్పిటల్స్ గ్రూపు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 80 చోట్ల పది లక్షల మందికి టీకాలు ఇచ్చినట్లు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శోభనా కామినేని తెలిపారు.