
జీవనోపాధి, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని శాఖలు టీమ్ వర్క్ తో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ఆదేశాల మేరకు సీఎస్ సంబంధిత శాఖాధిపతులతో జీవనోపాధి, నైపుణ్య కార్యక్రమాలపై గురువారం బిఆర్ కెఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలను సీఎస్ ఈ సందర్భంగా సమీక్షించారు.