
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే అనేక మంది పలు రకాలుగా స్పందించారు. గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. తాజాగా బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా ఓ టెలివిజన్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్లవి. ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తారా లేదా అనే దాని గురించి నేనే పెద్దగా అలోచించడం లేదు అని సమాధానం ఇచ్చారు.