
కరోనా కారణంగా దేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను వారిపాలిట ఆపద్భాంధవుడిగా నిజమైన హీరో సోనూసూద్ మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. కర్ణాటకలోని సోనూసూద్ బృందం సకాలంలో స్పందించి ప్రాణాపాయస్థితిలో ఉన్న 22 మంది రోగుల ప్రాణాలను రక్షించింది. బెంగళూరులోని అరక్ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడినట్లు కర్ణాటకలోని సోనూసూద్ బృందానికి అత్యవసర సందేశం అందింది. సకాలంలో ప్రాణవాయువు అందక ఇప్పటికే అక్కడ ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోయారు. 22 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయాన్ని తెలుసుకొని కొన్ని నిమిషాల్లోనే అరక్ హాస్పిటల్ కి 16 ఆక్సిజన్ సిలిండర్లను అందించింది.