
రెండు రోజులుగా అందరితో మాట్లాడానని పాత ఉద్యమకారుల సలహాలు తీసుకున్నానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని జిల్లాల నేతలూ వచ్చి కలిశారన్నారు. తనకు జరిగిన అన్యాయం పై స్పందించారన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఆత్మీయులతో గౌరవం పెద్ద సమస్య అయ్యిందని పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయమని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. సమస్య వస్తే మీ దగ్గరికే వస్తానని ఈటల వెల్లడించారు.