
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, సీఎం వైస్ జగన్ నివాళులు అర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద ఆయన ప్రత్యేక ప్రార్థలు నిర్వహించారు. ఆయనతో పాటు సతీమణి భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, పలువురు మంత్రులు, వైకాపా నేతలు వైఎస్ ఆర్ కు నివాళులర్పించారు.
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి అన్న జగన్ తో విభేదించిన వైఎస్ షర్మిల ఈ వర్థంతి వేళ అన్నయ్య జగన్ తో కలిసి ప్రార్థనలు చేయడం విశేషం. చెల్లి తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్లడం సూతారం ఇష్టం లేని జగన్ వైఎస్ఆర్ జయంతి వెళ మొన్న కలుసుకోలేదు. ఇద్దరూ వేర్వేరుగా నివాళులర్పించారు. కానీ నేడు వర్థంతికి వచ్చేసరికి ఇద్దరూ ఒకే సమయంలో ఒకేసారి పక్కపక్కన కూర్చొని నివాళులర్పించారు. దీన్ని బట్టి ఇద్దరూ కలిసిపోయారని తెలుస్తోంది.. విభేదాలను పక్కనపెట్టారని అర్థమవుతోంది.